శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 15 సెప్టెంబరు 2014 (15:08 IST)

ఔను... నేను ఆడదాన్ని... నాకు స్తన సంపద ఉంది... దీపికా పదుకునె ఆగ్రహం

బాలీవుడ్‌ స్పైసీ లేడీ దీపికా పదుకునే నేరుగా ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ఓ ఆంగ్ల దినపత్రిక ఆమె ప్రైవేట్‌ ఫంక్షన్‌కు వచ్చినప్పుడు ఆమె ఎద సంపదపై వ్యాఖ్యానిస్తూ... ఫొటోలతో స్పెషల్‌ వార్త రాసింది. దానికి స్ట్రెయిట్‌గానే దీపికా చురక వేసింది. అవును.. నేను ఆడదాన్ని. నాకు స్తన సంపద వుంది. మీకేమైనా అభ్యంతరమా అంటూ ప్రశ్నించింది. 
 
తన వస్త్రధారణ విషయంపై ఆమె ఇలా అంది. గ్లామర్‌ ఫీల్డులో ఇవన్నీ మామూలే. మహిళలు ఇక్కడ నటిస్తున్నారని చులకనగా రాయకండి.. అంటూ ఘాటుగా స్పందించింది. ఇది చాలా చీప్‌ జర్నలిజం అనీ, రకరాలుగా ఇతరులపై కూడా కథనాలు రాస్తూ పబ్బం గడుపుకుంటున్నారని వ్యాఖ్యానించింది. దీనిపై సోషల్‌ మీడియాలో దీపికాకు చాలా పాపులర్‌గా సపోర్ట్‌ వచ్చేసింది. అంతా దీపికకు సపోర్టుగా నిలబడుతున్నారు.