శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR

పవన్ కళ్యాణ్‌పై భక్తి గీతం.. అభిమానుల రూపకల్పన!

టాలీవుడ్ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై భక్తి గీతం ఒకటి రూపుదిద్దుకుంది. దీన్ని ఆయన భక్తులే రచించారు. విక్టరీ వెంకటేష్‌తో కలిసి పవన్ కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం 'గోపాల గోపాల' సినిమాలో ఈ హీరో దేవుడిగా చూసిన ఆయన అభిమానులు స్ఫూర్తి పొంది, ఆయనపై ఓ భక్తి గీతాన్ని రూపొందించారు. 
 
ఈ భక్తి గీతాన్ని పవన్ కల్యాణ్ నటించిన సినిమాల్లోని పాటలతో భజనలా రూపొందించడం విశేషం. భజనకు వచ్చినట్టే పవన్‌ను పూజించడానికి రావడం, అందరికీ బొట్లుపెట్టడం, భజన అయ్యాక ప్రసాదాలు పంచడం అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఈ పాట యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది.