శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శనివారం, 27 జూన్ 2015 (13:22 IST)

ఉత్తమ బాలల చిత్రంగా ''కాక్కాముట్టై''... ధనుష్‌కు కోర్టు సమన్లు...

న్యాయవాదులను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయంటు ఆరోపణలు ఎదుర్కొంటున్న 'కాక్కముట్టై' సినీ నిర్మాత, ప్రముఖ హీరో ధనుష్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. ఆ చిత్రంలో అనేక సన్నివేశాలు న్యాయవాదులను కించపరిచే రీతిలో ఉన్నాయంటూ అఖిల భారత న్యాయవాదుల సంఘం పరిరక్షణ అధ్యక్షుడు మణివన్నన్ పిటిషన్ వేశాడు. 
 
ఈ పిటిషన్ ఎగ్మూరు మేజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాది మురుగన్ ముందు విచారణకు వచ్చింది. ఈ కేసులో న్యాయవాదుల తరపున వాదించిన న్యాయవాది నమోనారాయణ మాట్లాడుతూ భారతీయ శిక్షాస్మృతి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కోర్టు ఆ చిత్ర నిర్మాతలైన ధనుష్, దర్శకుడు వెట్రిమారన్, చిత్ర దర్శకుడు మణికంఠన్‌లకు సమన్లు జారీచేసింది. ఈ సంఘటన కోలీవుడ్‌లో కలకలం రేపుతోంది.

కాగా చెన్నైలో జరిగిన 62వ ఫిలిం ఫేర్ అవార్డుల వేడుకలో ఉత్తమ బాలల చిత్రంగా అవార్డును పొందటం విశేషం. ఆ అవార్డును చిత్ర దర్శకుడు మణికంఠన్ పొందారు.