శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 29 అక్టోబరు 2014 (13:32 IST)

దిల్ రాజు బ్యానర్‌లో ఎన్టీఆర్! రామయ్య వస్తావయ్యా తర్వాత?

దిల్ రాజు బ్యానర్‌లో సినిమా చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. సినిమా ఫ్లాప్‌లు కావడం విసిగిపోయి.. సక్సెస్ కోసం తపిస్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు కథలనే కాకుండా నిర్మాతలను కూడా ఆచితూచి ఎంచుకుంటున్నాడు. 
 
ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్టు తాజా సమాచారం. దీంతో ప్రస్తుతం దిల్ రాజు మంచి కథ కోసం వెతుకుతున్నాడట. ఈ ప్రాజక్టుకి 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహించే అవకాశం వుందని సమాచారం. 
 
ఎన్టీఆర్‌కి సూటయ్యే మంచి సబ్జెక్టు తయారుచేయమని భాస్కర్‌కు ఇప్పటికే దిల్ రాజు చెప్పినట్టు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. ఇదిలా ఉంచితే, ఆ మధ్య దిల్ రాజు బ్యానర్లో ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంలో ఎన్టీఆర్ నటించిన సంగతి తెలిసిందే.