శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 4 మార్చి 2015 (12:09 IST)

'డర్టీ పాలిటిక్స్' విడుదలపై పాట్నా హైకోర్టు బెంచ్ నిషేధం!

మల్లికా షెరావత్ నటించిన డర్టీ పాలిటిక్స్ సినిమాకు అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. 'డర్టీ పాలిటిక్స్' విడుదలపై పాట్నా హైకోర్టు డివిజన్ బెంచ్ నిషేధం విధించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు, ఈ చిత్రంలో ఉన్న అభ్యంతరకర సన్నివేశాలు తొలగించేంతవరకు విడుదల చేయవద్దని సదరు అధికారులను ఆదేశించింది. 
 
ఇదే సమయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌కు న్యాయస్థానం నోటీసు జారీ చేసింది. ఇందులో దేశ జాతీయ జెండాను మల్లిక తన దేహంపై కప్పుకుని జెండాను అగౌరవపరిచిందని, అవమానించిందంటూ పిటిషనర్ ఫిర్యాదు చేశాడు. కేసీ.బొకాడియా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలకావల్సి ఉంది. అయితే సినిమాలో జాతీయ జెండాకు సంబంధించిన అభ్యంతర సన్నివేశాలుండటంతో రిలీజ్‌కు బ్రేక్ పడింది.