శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 27 జనవరి 2015 (20:41 IST)

తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో 'డా. సలీమ్‌' పాటలు

విజయ్‌ ఆంటోని, అక్ష జంటగా రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'డా.సలీమ్‌'. నాగప్రసాద్‌ సన్నితి సమర్పణలో ఎస్‌ కె. పిక్చర్స్‌ మరియు ఓబులేశ్వర ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్ర అనువాద కార్యక్రమాలు, పాటల రికార్డింగ్‌ పూర్తయ్యాయి. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది.    
 
తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ ''సురేష్‌ కొండేటి ఎస్‌.కె. పిక్చర్స్‌ నుండి ఇంతకు ముందు పది ఆణి ముత్యాల్లాంటి చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రాల సరసన నిలబడే చిత్రంగా ఈ పదకొండో చిత్రం డా.సలీమ్‌ ను చెప్పుకోవచ్చు. సక్సెస్‌‌ఫుల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ గా పేరు తెచ్చుకున్న విజయ్‌ ఆంటోని ఈ చిత్రానికి మంచి మ్యూజిక్‌‌ను అందించారు. ఈ చిత్రం సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.

 
నిర్మాతల్లో ఒకరైన సురేష్‌ కొండేటి మాట్లాడుతూ ''హాస్పిటల్‌ లో జరిగే సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ చిత్రానికి సంబంధించిన డైలాగ్‌లను, పాటలను సాహితి రాసారు. పాటలన్నీ స్వరాల పరంగానే కాక సాహిత్యం పరంగా కూడా బాగున్నాయి. ఈ పాటలను హేమచంద్ర, సుప్రియా జోష్‌, మహాలింగం, ప్రభు, సంతోష్‌ తదితరులు పాడారు. ఈ చిత్రం మంచి మ్యూజికల్‌ హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది. సరిగమ ఆడియో సంస్థ ద్వారా ఈ పాటలను విడుదల చేసాం. హీరోగా నటించడంతో పాటు విజయ్‌ ఆంటోని మంచి పాటలను స్వరపరిచారు. ఆయన నటన హైలైట్‌ గా నిలుస్తుంది'' అని చెప్పారు. మంచి కధాంశంతో రూపొందిన చిత్రం ఇదని మరో నిర్మాత తమటం కుమార్‌ రెడ్డి చెప్పారు.
 
రైటర్‌ సాహితి మాట్లాడుతూ ''సురేష్‌ కొండేటి నిర్మించిన చిత్రాల్లో జర్నీ, పిజ్జా సినిమాలకు నేను డైలాగ్‌ రైటర్‌ గా పని చేసాను. ఈ చిత్రంలో విజయ్‌ ఆంటోని చేసిన పాత్ర ఆయన నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. ఈ సినిమాలో హీరో ఒంటరి పోరాటం చేస్తాడు, హీరో తీసుకున్న నిర్ణయాన్ని ప్రేక్షకులందరూ అభినందిస్తారు'' అని చెప్పారు.
 
తమిళ నిర్మాత ఫాతిమా మాట్లాడుతూ ''ఈ చిత్రాన్ని తమిళంలో నేనే ప్రొడ్యూస్‌ చేసాను. తమిళంలో విడుదలై నలబై కోట్లను కలెక్ట్‌ చేసి రికార్డు సృష్టించిన చిత్రమిది. ఒక మామూలు చిత్రంగా విడుదలై చాలా పెద్ద చిత్రంగా నిలిచింది. హీరోయిన్‌‌గా నటించిన అక్ష తన పాత్రలో జీవించిందనే చెప్పాలి.తమిళంలో నా నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ ఇండియా పాకిస్తాన్‌ ఆ చిత్రాన్ని కూడా తెలుగులో నిర్మిస్తాం'' అని అన్నారు.
 
హీరోయిన్‌ అక్ష మాట్లాడుతూ ''తమిళంలో మంచి హిట్‌ కొట్టిన ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించడం అందులో నేను లీడ్‌ రోల్‌ ప్లే చేయడం చాలా సంతోషంగా ఉంది. విజయ్‌ ఆంటోని మల్టీ టాలెంటెడ్‌ పర్సన్‌. ఈ చిత్ర కధానాయకునిగా విజయ్‌ ఎంతో బాగా చేసారు. ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్‌‌లో బాగా నటించారు. డా.సలీమ్‌ సినిమా తెలుగునాట మంచి ఊపును తీసుకువస్తుందనడంలో సందేహం లేదు'' అని అన్నారు.
 
నటి అంభిక మాట్లాడుతూ ''విజయ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ గా చేసిన ఒక చిత్రంలో నేను నటించాను. ఈ చిత్రంలో పాటలు చాలా గొప్పగా ఉన్నాయి. ట్రైలర్‌ చూస్తుంటే సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుందనిపిస్తుంది'' అని చెప్పారు. సంగీత దర్శకుడు రాధా కృష్ణ మాట్లాడుతూ ''విజయ్‌ తమిళంలో చేసిన సినిమాలు చాలా చూసాను. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించడంతో పాటు హీరోగా కూడా ఆయన చేయడం సంతోషంగా ఉంది. సురేష్‌ కొండేటి కి ఈ సినిమా మంచి టాక్‌ తో పాటు కమర్షియల్‌‌గా హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నా'' అని అన్నారు.