శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 17 డిశెంబరు 2014 (21:23 IST)

'డాక్టర్‌ సలీమ్‌' లోగో విడుదల

ప్రముఖ సంగీత దర్శకుడు విజయ్‌ ఆంటోని, అక్ష పార్థసాని జంటగా నటించిన తమిళ చిత్రం 'సలీమ్‌'. ఎస్‌.కె. పిక్చర్స్‌, శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా తెలుగులోకి విడుదల చేయనున్న ఈ చిత్రానికి 'డాక్టర్‌ సలీమ్‌' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సురేష్‌ కొండేటి, తమటం కుమార్‌ రెడ్డి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
 
ఈ చిత్రం శ్రీకాంత్‌ మాట్లాడుతూ... 'నేను నటించిన 'మహాత్మ' చిత్రానికి విజయ్‌ ఆంటోని పాటలందించారు. ఆ చిత్రవిజయానికి పాటలు కూడా ఓ కారణం. ఇప్పుడు విజయ్‌ ఆంటోని హీరోగా నటించిన చిత్రానికి లోగోను విడుదల చేయడం ఆనందంగా ూంది' అన్నారు.
 
సురేష్‌ కొండేటి మాట్లాడుతూ... ''ఇదొక మంచి యాక్షన్‌ థ్రిల్లర్‌. ఇందులో హీరోగా నటించడంతో పాటు విజయ్‌ ఆంటోని పాటలు కూడా స్వరపరిచారు. ఐదు పాటలూ సందర్భానుసారంగా సాగుతాయి. విజయ్‌ ఆంటోని చేసిన ఫైట్స్‌ థ్రిల్‌ కి గురి చేస్తాయి. మా సంస్థ నుంచి వచ్చిన గత చిత్రాల విజయానికి ఏమాత్రం తగ్గని రీతితో ఈ చిత్రం ఉంటుంది' అని తెలిపారు.