శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 30 ఆగస్టు 2014 (13:39 IST)

మణిరత్నం రూట్ మార్చాడు: దుల్కర్.. అలియా భట్‌తో కొత్త సినిమా!?

మణిరత్నం రూట్ మార్చాడు. ఇకపై అగ్రహీరోలతో పనొద్దనుకున్నాడు. టాప్ హీరోలు... టాప్ హీరోయిన్ల సినిమాలు చేస్తే ఈ మధ్య అచ్చిరాలేదనే సెంటిమెంట్‌తో దొరికిన స్టార్లతో సినిమా చేసుకుపోదామనుకుంటున్నాడు.
 
ఒకప్పుడు మణిరత్నం లెవలే వేరు. రజనీకాంత్, చిరంజీవి, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలు మణితో సినిమా చేయాలని ఉవ్విళ్లూరేవారు. అయితే ట్రెండ్ మారిపోయింది. స్టార్స్ ఎవరూ ఆయనతో చేయడానికి ముందుకు రావడం లేదు.
 
కారణం, ఇటీవలి కాలంలో మణికి హిట్స్ లేవు అన్నీ ఫట్సే. సినిమా మేకింగ్‌లో ఆయనకు గ్రిప్ సన్నగిల్లిందనే అభిప్రాయంతో చాలామంది అగ్రస్టార్లు సినిమాలు చేసేందుకు ముందుకు రావట్లేదు. 
 
అందుకే, ఈ మధ్య చిరంజీవి, మహేష్ బాబు, నాగార్జున, రామ్ చరణ్ వంటి తారల చుట్టూ మణిరత్నం తిరిగినప్పటికీ లాభం లేకపోయింది. దాంతో విసుగెత్తిన మణి ఇప్పుడు తనకు అందుబాటులో వున్న తారలతోనే సినిమా చేయడానికి డిసైడ్ అయిపోయాడు. 
 
మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ కథానాయిక అలియా భట్ హీరో హీరోయిన్లుగా తన తదుపరి చిత్రాన్ని తీయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అదండీ టైమ్ అంటే..!