శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2015 (15:23 IST)

బన్నీ సరసన బాలీవుడ్ హీరోయిన్.. సన్నాఫ్ సత్యమూర్తితో అమీరా!

సన్నాఫ్ సత్యమూర్తి హిట్టవడంతో మంచి ఊపుమీదున్న అల్లు అర్జున్ తదుపరి సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. దర్శకుడు బోయపాటి శీనుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన అల్లు అర్జున్.. కొంతకాలం ఈ ప్రాజెక్టుపై చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే తాజా కథనాల ప్రకారం ఈ సినిమా స్క్రిప్టుకు తాజాగా బన్నీ పచ్చజెండా ఊపాడని సమాచారం. దీనికి తమన్ సంగీతాన్ని అందిస్తాడని తెలిసింది.
 
ఈ బన్నీ-బోయపాటి మూవీలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, వారిలో ఒకరిగా 'మిస్టర్ ఎక్స్' హిందీ సినిమాలో కథానాయికగా నటించిన అమీరా దస్తూర్‌ని ఎంచుకున్నారని సమాచారం. మరో కథానాయిక ఎంపిక జరుగుతోంది. ఇకపోతే.. అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి సినిమాకు కేరళలోనూ మంచి టాక్ వస్తోంది.