శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: గురువారం, 26 ఫిబ్రవరి 2015 (14:06 IST)

మహేష్ బాబు 'శ్రీమంతుడు' ఓవర్‌సీస్‌ లుక్‌... అదరహో....

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న 'శ్రీమంతుడు' చిత్రం క్లాసిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఓవర్‌సీస్‌లో డిస్ట్రిబ్యూషన్‌ చేస్తుంది. ప్రముఖ చిత్రాలను పంపిణీ చేసిన ఆ సంస్థ ఈసారి మహేష్‌ బాబు సినిమా చేయడం గర్వంగా ఉందని చెబుతోంది. 

 
మహేష్‌ బాబు, శ్రుతి హాసన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో తులసి, సితార వంటి సీనియర్‌ నటీమణులు కూడా నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ ఇస్తున్న ఈ చిత్రం టెక్నికల్‌ వాల్యూస్‌ ఎంతో గొప్పగా వుంటాయని చెబుతుంది. ఈ చిత్రం లుక్‌ను గురువారం నాడు ఆ సంస్థ విడుదల చేసింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయనున్నట్లు తెలిసింది.