శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 18 సెప్టెంబరు 2014 (13:24 IST)

శింబుతో ప్రేమ ఫట్ అయినా.. హన్సికను వదలని..?

శింబుతో ప్రేమ ఫట్ అయినా.. తెల్లమ్మాయ్ హన్సికకు తలనొప్పి వదలట్లేదు. 'వాలు' అనే సినిమాలో శింబు, హన్సిక కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రారంభంలో ప్రేమలో పడి, చివరికొచ్చేసరికి బ్రేకప్ అయ్యారు. అయితే, ఆ సినిమా షూటింగ్ మాత్రం పూర్తికాలేదు. అయినప్పటికీ ఆమె ఇటీవల మళ్లీ డేట్స్ ఇచ్చి సహకరించింది. కానీ, ఇంకా పూర్తికాలేదట.
 
దీనిపై ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. "మొదట్లో 64 రోజులు అడిగారు. అంతేకాకుండా, అదనంగా మరో ఇరవై రోజులిచ్చాను. తర్వాత ఇంకో పాట తీయాలంటే ఈ నెల 7, 8, 9 తేదీల్లో డేట్స్ ఇచ్చాను. 
 
వాటిని ఆ నిర్మాత సద్వినియోగం చేసుకోలేదు. ఇప్పటికే నా డేట్స్ చాలా వేస్ట్ అయ్యాయి. ఈ సినిమా పూర్తికాకపోవడం విషయంలో నా తప్పేమీ లేదు. ఇకపై నేడు డేట్స్ ఇచ్చేది లేదు" అంటూ అమ్మడు తేల్చి చెప్పేసింది. ప్రేమ ఫట్ అంటే.. అదన్నమాట!