శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (16:12 IST)

రేణూ దేశాయ్ సమక్షంలో పవన్ పుట్టినరోజు అనుకున్నా...

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు నేడే. సెప్టెంబర్‌ 2న ఆయన పుట్టిన దినాన్ని రేణు దేశాయ్‌ సమక్షంలో జరుపుకోవాలని ముందుగా నిర్ణయించుకున్నా పరిస్థితులు అనుకూలించలేదు. మళ్ళీ ఆమె దగ్గరకు వెళ్ళడం పెద్ద చర్చనీయాంశంగా మారుతుందని మానివేసినట్లు సమాచారం.
 
మేనరిజంలో ప్రత్యేకత!
పవన్‌కళ్యాణ్‌ కెరీర్‌లో చూసుకుంటే 'ఖుషి' సినిమా తర్వాత ఆయన కెరీర్‌ చాలమటుకు మార్పు చెందింది. ఇక్కడబ్బాయి అక్కడమ్మాయితో కెరీర్‌ను ప్రారంభించినా.. అది పెద్దగా ఫలితం ఇవ్వలేదు. చిరంజీవి నేపథ్యాన్ని చూసుకుని వచ్చిన ఆయన రానురాను మేనరిజంలోనూ చేయి మెడవైపు పెట్టుకుని కొత్తగా కన్పించేవారు. డైలాగ్‌లు పకడంలోనూ, హావభావాలు 'హ..హ..' అంటూ పలికిస్తూ బాడీని తిప్పడంలోనూ అభిమానులకు కొత్తగా వుండేది. 
 
ఇది హాలీవుడ్‌ నటుడు నుంచి స్పూర్తిగా పొందారు. సముద్రపు దొంగలు పేరుతో వచ్చిన సీక్వెల్‌లో హాలీవుడ్‌లో చిత్రాలున్నాయి. అందులో ప్రధాన పాత్రధారిని అనునయించాడని ఆయన సన్నిహితులు చెబుతుండేవారు. ఏది ఏమైనా ఆయనకు అభిమానులు తన అన్న చిరంజీవి కంటే ఎక్కువగా పోగయ్యారనేది ఇప్పటి టాక్. 
 
కథల్లో జాగ్రత్త 
ఒక్కోసారి కథలు ఎంపికలో కెరీర్‌ ఆరంభంలో చిరంజీవి కొన్ని సలహాలు ఇస్తుండేవాడు. కానీ రానురాను అది స్వంతంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరింది. అంతగా సినిమాను అప్‌డేట్‌ చేసుకున్నాడు. ముఖ్యంగా రొటీన్‌గా వచ్చే సినిమా డైలాగ్‌లు కానీ కథలు కానీ ఒప్పుకొనేవాడు కాదు. అలాంటి పవన్‌ కొన్ని చేదుమాత్రలు కూడా రుచి చూశారు. ఎన్‌ఆర్‌ఐ అయిన ఓ నిర్మాత.. కోరిక మేరకు 'పంజా' అనే చిత్రంలో నటించి ప్లాప్‌ సంపాదించుకున్నాడు. 
 
అలా ఒక దశలో ఐదు చిత్రాలు ఏమాత్రం ఆడలేదు. అలాంటి  దశలో గబ్బర్‌సింగ్‌తో ఒక్కఊపు ఊపేశాడు. సినిమా హీరోలకు నాలుగైదు ప్లాప్‌లు వస్తే.. ప్రేక్షకులు మర్చిపోతారనీ, బయట బ్యాడ్‌ చెప్పుకుంటారనేది మామూలే. కానీ వరుసగా సినిమాలు చేసే హీరోలకు ఎప్పుడో ఒకప్పుడు హిట్‌ రాకమానదు. అలా పవన్‌కు వచ్చింది. ఆ తర్వాత 'అత్తారింటికి దారేది'తో తెలుగు కలెక్షన్లను సృష్టించాడు. ఇలా కెరీయర్‌ సాగిస్తున్న పవన్‌ ఇప్పుడు... గోపాల గోపాల .. సినిమాను వెంకీతో చేస్తున్నాడు.
 
పవన్‌ ప్రస్తుతం శాఖాహారి. కరాటేలో బ్లాక్‌బెల్ట్‌ తీసుకున్నాడు. పవన్‌కు శంషాబాద్‌లో ఓ ఫామ్‌ హౌస్‌ వుంది. అక్కడ నులక మంచం, పడక కుర్చీలో కూర్చుంటూ.. వ్యవసాయం చేస్తూ... చెట్లు పెంచుతూ... గ్రామీణ రైతులా వుంటాడు. 
 
హిట్‌ప్లాప్‌తో సంబంధంలేదు 
హీరోకు హిట్‌ప్లాప్‌తో సంబంధం లేని నటుడు పవన్‌ కళ్యాణ్‌. ఎప్పటికప్పుడు బాక్సాఫీసు లెక్కల్ని మార్చేస్తూ సినిమాలు ట్రెండ్‌ సృష్టిస్తాడు. చాలామందికి ఏదో ఒకటి చెప్పి సాయం చేసే తత్వం వుంటుంది. పవన్‌కూ వుంది. తన దగ్గరకు వచ్చిన వారిని ఆదుకునే వ్యక్తిత్వం ఉందని అంటారు. తన ఫ్యాన్స్‌ ఏదో సామాజిక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తే వారిని ముందుగా పవనిజం అనే పేరుతో పలు కార్యక్రమలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం వారు పవనిజం పేరుతో సినిమా తీశారు. ఈరోజు ఆడియోను నాగబాబు చేత విడుదల చేయించనున్నారు. సినిమాను త్వరలో విడుదల చేయనున్నారు. ఇలా పవన్‌ పేరుతో చేయడం ఆయన కుటుంబంలో పవన్‌కు దక్కిన అదృష్టంగా ఫ్యాన్స్‌ చెబుతుంటారు.