శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 28 జనవరి 2015 (13:31 IST)

కథనాయికగా హీరోయిన్ కూతురు.. ఎంట్రీకి రెడీ..!

వెండితెరపై అగ్రహీరోలుగా వెలుగుతున్న పలువురు తమ వారసులను సినీ పరిశ్రమకు పరిచయం చేయడం మామూలే. అయితే ఇటీవల కాలంలో హీరోల పిల్లలే కాకుండా, హీరోయిన్ల పిల్లలు కూడా తమ తల్లిదండ్రులకు వారసులుగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. వీరిలో కొందరు బాగా సక్సెస్ అయిన వాళ్లు కూడా వున్నారు. 
 
ఈ వరుసలో ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కూతురు తెరంగేట్రం చేయనుంది. నిన్నటితరం ప్రముఖ హీరోయిన్‌ గౌతమి కూతురు సుబ్బులక్ష్మి నటన పట్ల ఆసక్తి చూపుతోందట. అది గ్రహించిన గౌతమి ఆమెకు ప్రస్తుతం నాట్యంలో శిక్షణ ఇప్పిస్తోంది. పనిలో పనిగా తను వెళ్లే ఫంక్షన్లకు కూతుర్ని తన వెంట తీసుకువెళుతూ నలుగురికీ పరిచయం చేస్తోంది. 
 
దీంతో కొందరు తమిళ దర్శక నిర్మాతలు ఆమెను కథానాయికగా పరిచయం చేస్తామంటూ ముందుకువస్తున్నారట. అయితే, తన కూతురి సినిమా ఎంట్రీ గురించి గౌతమి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె సన్నిహితులు తెలుపుతున్నారు. కాగా మరో వర్గం మాత్రం త్వరలోనే సుబ్బు లక్ష్మి వెండితెరపై వెలుగుతుందని అంటున్నారు.