1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 29 మే 2015 (14:23 IST)

హృతిక్ రోషన్.. పూజా హెగ్డేను ప్రేమిస్తున్నాడా? అమీర్ ఖాన్‌ను ఫాలో అవుతున్నాడా?

అవునండి.. మీరు చదువుతున్నది నిజమేనట. ముంబై ఫిల్మ్ నగర్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. హృతిక్ రోషన్ భార్యతో విడాకులయ్యాక మొహంజొదరో కో-స్టార్ పూజా హెగ్డేతో ప్రేమాయణం మొదలెట్టాడని తెలిసింది. పూజా హెగ్డేతో ఫ్రెండ్లీగా ఉంటున్న హృతిక్ రోషన్.. ఈ మధ్య చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నాడని సమాచారం. 
 
ఇకపోతే.. అమీర్ ఖానే హృతిక్ రోషన్ ఫాలో అవుతున్నాడని, అమీర్ తన మాజీ భార్య రీనాతో కటీఫ్ అయ్యాక కిరణ్ రావుతో ప్రేమాయణం మొదలెట్టినట్లే.. హృతిక్ రోషన్ కూడా తన భార్యతో విడాకులు తీసుకుని పూజా హెగ్డేతో హ్యాపీగా తిరుగుతున్నాడని బాలీవుడ్ జనం కోడైకూస్తోంది. 
 
అంతేకాదు.. కిరణ్ రావుదు కర్ణాటక అయితే పూజా హెగ్డేది కూడా ఒకే రూటైన ఉడిపి అని దీంతో హృతిక్‌కు పూజా హెగ్డే సెటైపోతుందని ఫిలిమ్ నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. కాగా పూజా హెగ్డే తమిళంలో ముగమూడి, తెలుగులో ఒక లైలా కోసం, ముకుందా చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.