1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 1 నవంబరు 2014 (13:12 IST)

హృతిక్ రోషన్-సుజన్నే ఖాన్ విడాకులు: పిల్లలు మాత్రం?

హృతిక్ రోషన్-సుజన్నే ఖాన్ దంపతులకు విడాకులు మంజూరయ్యాయి. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌కు అతని భార్య సుజన్నే ఖాన్‌లకు మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకోవడంతో.. వీరిద్దరికీ కోర్టు విడాకులు మంజూరు చేయాల్సి వచ్చింది. 
 
గతేడాది డిసెంబర్‌లో విడిపోవాలని నిర్ణయించుకున్న వారిద్దరు ముంబయిలోని బాంద్రా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటి ఆధారంగా న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. అయితే, కోర్టు వాదనలకు వచ్చేందుకు కుదరని హృతిక్ మరో తేదీని ఇవ్వాలని అడిగాడట. కానీ, షెడ్యూల్ ప్రకారం అంటే అక్టోబర్ 31న విచారణ పూర్తవడంతో కోర్టు విడాకులిచ్చేసింది. 
 
అటు వారిద్దరి పిల్లలు ఎవరి కస్టడీలో ఉండాలనేది ఇంకా నిర్ణయించలేదట. ఈ విషయాన్ని కూడా త్వరలోనే న్యాయస్థానం తేల్చనుంది. ప్రేమించి వివాహం చేసుకున్న హృతిక్, అతని భార్యకు హ్రిహాన్, హ్రిదాన్ అనే ఇద్దరు కుమారులున్న సంగతి తెలిసిందే.