1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 అక్టోబరు 2014 (15:03 IST)

వర్క్ వర్క్ వర్క్.. నో వెడ్డింగ్ ఐడియా: అంజలి

''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'' సినిమా ద్వారా పాపులర్ అయిన అంజలి ప్రస్తుతం బిజీ బిజీ అయ్యింది. ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్‌లలో అమ్మడు సినిమా షూటింగ్‌లతో టైమ్ లేకుండా గడుపుతోంది. తమిళంలో తాజాగా జయం రవితో అంజలి నటిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో అంజలికి త్వరలో పెళ్లి కాబోతున్నట్లు వస్తున్న వార్తలను ఆమె కొట్టి పారేసింది. ప్రస్తుతం తాను చాలా బిజీగా ఉన్నానని చెప్పింది. పూర్తిగా కెరీర్ పైనే దృష్టి పెట్టానని... ఇప్పట్లో పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది. 
 
"నా మైండ్‌లో వర్క్ వర్క్ వర్కే తప్ప వెడ్డింగ్ ఐడియా" లేదంటూ.. అంజలి వెల్లడించింది. కాగా అంజలి కన్నడంలో ధీర రానా విక్రమ అనే సినిమాలో తమిళంలో టైటిల్ ఖరారు కాని జయం రవి హీరోగా నటించే చిత్రంలోనూ నటిస్తోంది. తెలుగులో ఇటీవలే విడుదలైన గీతాంజలి ఆమెకు మోస్తరు కలెక్షన్లను ఇచ్చింది.