కమల్ హాసన్‌కు అనారోగ్యం.. ఫుడ్‌పాయిజనింగ్‌తో ఆస్పత్రిలో చేరిక!

Selvi| Last Updated: మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (15:13 IST)
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన విశ్వవిఖ్యాత నటుడు, రచయిత, దర్శకుడు కమల్ హాసన్ ఫుడ్ పాయిజనింగ్కు గురయ్యారు. దాంతో ఆయనను చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం భేషుగ్గా ఉందని, నేడు లేదా రేపు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా, 59 ఏళ్ల కమల్ హాసన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కుదుటపడిందని, ఆయన పరిస్థితిని బట్టి ఒకటి రెండు రోజుల్లో ఆయనను డిశ్చార్జి చేస్తామని వైద్యవర్గాలు తెలిపాయి. తొలుత కమల్ నరాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారని కథనాలు వచ్చాయి. వాటిని వైద్య వర్గాలు ఖండించాయి. అయితే.. అసలు ఏం జరిగిందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.దీనిపై మరింత చదవండి :