శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 23 సెప్టెంబరు 2014 (15:18 IST)

''అత్తారింటికి దారేది'': పవన్ కళ్యాణ్ పాత్రలో షారూఖ్ ఖాన్!!

'అత్తారింటికి దారేది' సినిమా హిందీలో రీమేక్ అయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో పవన్ కల్యాణ్ పోషించిన పాత్రను బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పోషించే అవకాశం కనిపిస్తోంది. 
 
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమా టాలీవుడ్‌లో భారీ కలెక్షన్స్‌ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ  సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారు.
 
తెలుగులో ఈ చిత్రానికి కో- ప్రొడ్యూసర్ ‌వ్యవహరించిన రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ దీనిని హిందీలో రీమేక్ చేస్తోంది. పవన్ పాత్రకు షారుఖ్ సరిగ్గా సరిపోతాడనీ, గతంలో కూడా తను ఫ్యామిలీ డ్రామా సినిమాలు చేసివున్నందున ఈ కథ అతనికి యాప్ట్ అనీ అంటున్నారు. షారుఖ్ కూడా ఈ ప్రాజక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.