1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 2 మార్చి 2015 (12:49 IST)

అజిత్, షాలినీ దంపతులకు ప్రమోషన్: కుట్టి అజిత్ పుట్టాడోచ్!

కోలీవుడ్ లవ్ బర్డ్స్ అజిత్, షాలినీ దంపతులకు ప్రమోషన్ వచ్చింది. కోలీవుడ్ దంపతులు అజిత్, షాలినీలు మరోసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్నారు. సోమవారం ఉదయం షాలిని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. వీరిద్దరూ తొలిసారిగా 1999లో 'అమర్కలం' చిత్రంలో కలసి నటించి, అనంతరం ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 
 
2000 సంవత్సరంలో వీరిరువురూ వివాహం చేసుకోగా, ప్రస్తుతం వారికి ఏడేళ్ల పాప వుంది. కొడుకు పుట్టడంతో, అజిత్ పట్టరాని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. చిత్రసీమలోని పలువురు ప్రముఖులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా అజిత్ ఎన్నై అరిందాల్ సినిమా రిలీజ్ అయి బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్స్ చూరగొన్న సంగతి విదితమే.