శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 24 నవంబరు 2014 (18:56 IST)

జయప్రద వారసుడి తమిళ అరంగేట్రం... అమర్ సింగ్ చెయ్యేస్తున్నాడట...

నటి జయప్రద... నిన్నటి తరం హీరోయిన్‌. బాలీవుడ్‌లో ఒక ఊపు ఊపింది. దాంతో రాజకీయ రంగంలోనూ రాణించి పదవులు పొందింది. అయితే ఆమె నటవారసుడిగా రాజాబాబు అనే తమ్ముడు వచ్చాడు. ఆ సినిమాలు ఏవీ ఆడలేదు. రెండు చిత్రాలు అసలు బయటకు రాలేదు. ఇప్పుడు తాజాగా ఆమె సోదరి కొడుకు సిద్దార్థ్‌ను వెలుగులోకి తెచ్చింది. 
 
ప్రస్తుతం తమిళ సినిమాలో నటింపజేసింది. తెలుగులో నితిన్‌ 'ఇష్క్‌' సినిమాను తమిళంలో 'ఉయిరే.. ఉయిరే..'గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జయప్రద రాజకీయ గురువు అమర్‌సింగ్‌ కూడా నిర్మాణంలో భాగస్వామి అవుతున్నాడట. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ బాణీలు ఇస్తున్నాడు. కాగా, ప్రత్యేకంగా ఈ సినిమాలో జయప్రద బ్యాక్‌గ్రౌండ్‌ వాయిస్‌ ఇస్తుందట. తన వారసుడ్ని ఆశీర్వదించమని అడగబోతుంది.