శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 18 ఆగస్టు 2014 (13:52 IST)

బుల్లి ఎన్టీఆర్‌ పేరు..'అభయ్‌రామ్‌': RAMను కలిపాం NAR అని పిలుస్తారు!

టాలీవుడ్ హీరో జూ.ఎన్టీఆర్‌, లక్ష్మీప్రణతిల పుత్రరత్నం, బుల్లి ఎన్టీఆర్‌కు ఆదివారం నామకరణం చేశారు. గత నెల 22వ తేదీన ఈ దంపతులకు పండంటి మగబిడ్డ పుట్టిన విషయం తెల్సిందే.
 
ఈ బుల్లి ఎన్టీఆర్‌కు నందమూరి అభయ్‌ రామ్‌ అని పేరు పెట్టారు. అభయ్‌రామ్‌ నామకరణ మహోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్‌ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు.
 
ఈ శుభ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు మాత్రమే వచ్చారు. ఇక బాబు పుట్టిన సందర్భంగా... ఎన్టీఆర్‌కు దర్శకుడు రాజమౌళితో పాటు పలువురు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు.
 
అలాగే తనకు కుమారుడు పుట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అభిమానులందరికీ ట్విట్టర్‌ వేదిక ద్వారా జూనియర్‌ ఎన్టీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. తన తాత పేరును తన కొడుకు పేరుతో ఇన్‌క్లూడ్ చేశానని.. నా జూనియర్‌ను నందమూరి అభయ్ రామ్‌ను షార్ట్‌గా NAR (నందమూరి అభయ్ రామ్) పిలుస్తారని జూనియర్ ఎన్టీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అందుకే తాత పేరులోని RAMను అభయ్‌కి చేర్చానన్నారు.