ఎన్‌టిఆర్‌ సినిమాతో ఆరంభం...

IVR| Last Modified శనివారం, 26 జులై 2014 (21:15 IST)
పూరీ జగన్నాథ్‌ ఎన్‌.టి.ఆర్‌.తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెలాఖరున ప్రారంభించాలనుకున్నారు. ఆగస్టు 1న లాంఛనంగా ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఎన్‌టిఆర్‌ రభస షూటింగ్‌ పూర్తయింది. కాగా, పూరీ జగన్నాథ్‌ మాదాపూర్‌లోని తన కార్యాలయాన్ని అధునాతన హంగులతో తీర్చిదిద్దారు.

గత కొన్ని నెలలుగా దాని పనిపైనే వున్నారు. ఇందుకోసం విదేశాలనుంచి ఫర్నిచర్‌, మెటీరియల్స్‌కూడా తెచ్చారు. గతంలోనే ఆయన ఆఫీసులో విదేశీముద్ర అడుగడుగునా కన్పిస్తుంది. దానికితోడు అక్కడి పక్షులను కూడా తీసుకువచ్చి వారిని పెంచుతుంటాడు.

ఐదు అంతస్తుల భవనంలో పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకునే వీలుగా తీర్చిదిద్దారు. ఏదైనా ఆఫీస్‌ కార్యాలయాన్నికూడా అక్కడే చిత్రీకరించవచ్చు. ఎన్‌టిఆర్‌తో తొలిసారిగా ఓ సన్నివేశాన్ని తన కార్యాలయంలో తీయడానికి పూరీ ప్లాన్‌ చేసినట్లు యూనిట్‌ సభ్యులు తెలుపుతున్నారు.దీనిపై మరింత చదవండి :