1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By IVR
Last Modified: గురువారం, 24 జులై 2014 (15:22 IST)

'రభస' ముగింపు సీన్... ఎన్‌టిఆర్‌ సెట్లో రభస చేశాడట

ఎన్‌టిఆర్‌, సమంత కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'రభస'. ఈ చిత్రం ముగింపు సీన్‌ను బుధవారం నాడు ఫిలింసిటీలో చేశారు. ఇంద్రహౌస్‌లో వేసిన భారీ సెట్‌లో.. హీరో కుటుంబానికి చెందినవారు, ప్రతినాయకులకు చెందిన వారంతా కలిసి సరదాగా ముగింపు పలికే సన్నివేశాన్ని దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ తెరకెక్కించారు. పాత సినిమాల్లో శుభం కార్డ్‌ వేసేటప్పుడు అంతా కలిసి నవ్వుకునే సన్నివేశాలుండేవి. రానురాను అలాంటికి కన్పించకుండాపోయాయి.
 
అంటే కుటుంబకథలు కొత్తట్రెండ్‌లో చూపించడంతో ఇలా జరుగుతుంది. కాగా బ్రహ్మానందం, షిండేతోపాటు భారీ తారాగణం పాల్గొన్నారు. తండ్రి అయ్యాక ఎన్‌టిఆర్‌ చేసిన మొదటి షాట్‌ గనుక... ఉదయమే చాలా హుషారుగా ఎన్‌టిఆర్‌ సెట్‌కు వచ్చి అందర్నీ పలుకరించి సంతోషంగా ఉన్నాడు. ఆయనకు అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్‌టిఆర్‌ ఇలా సెట్లో ఇంత సరదాగా ఎప్పుడూ ఉండలేదని చిత్ర యూనిట్‌ చెబుతుంది. చివర్లో యూనిట్‌తో ఫొటోలు కూడా దిగాడు.