'రభస'లో పక్కా మాస్ లుక్‌తో జూ ఎన్టీఆర్ - 29న రిలీజ్

rabhasa still
PNR| Last Updated: గురువారం, 21 ఆగస్టు 2014 (11:47 IST)
హీరో జూనియర్ ఎన్టీఆర్, సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం రభస. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ పక్కా మాస్‌తో కనిపిస్తుండటంతో నందమూరి అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని రేపుతోంది. మరోవైపు ఈ చిత్రాన్ని ఈనెల 29వ తేదీన విడుదల చేసేందుకు నిర్మాత ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి ‘కందిరీగ’ ఫేమ్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై బెల్లంకొండ సురేష్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదలపై నిర్మాత మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఈ సినిమా ఆడియో చాలా పెద్ద హిట్‌ అయింది. ఇందులో ఎన్టీఆర్‌ పాడిన 'రాకాసి రాకాసి’ ఈ ఆడియోకి హైలైట్‌ అవుతుంది. త్వరలోనే ట్రిపుల్‌ ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుక చేస్తామని చెప్పారు.

కాగా, ఈ నెల 29న విడుదల కానున్న ఈ సినిమా ఎన్టీఆర్‌ కెరీర్‌లో, మా సంస్థలో సెన్సేషనల్‌ హిట్‌ అవుతుందని చెప్పారు. ఆ తర్వాత దర్శకుడు మాట్లాడుతూ యూత్‌ఫుల్‌, మాస్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. పక్కా మాస్‌ లుక్‌తో ఎన్టీఆర్‌ కనిపిస్తారు. యూత్‌ఫుల్‌ స్టైల్‌లో ఉంటారు. ఫ్యామిలీని ఆకట్టుకుంటారు. ఈ మూడు జోనర్లను టార్గెట్‌ చేసి అందరూ ఎంజాయ్‌ చేసేలా తెరకెక్కించినట్టు చెప్పారు.దీనిపై మరింత చదవండి :