శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 28 జనవరి 2015 (15:47 IST)

అవంటే భయం పోయింది... కాజల్‌ ధీమా..!

మనిషన్నాక ఏదో ఒక భయం ఉంటుంది. ఇక సినిమాల పుణ్యమాని కొందరు ఆర్టిస్టులకు ఉన్న భయాలు పోతాయి, మరి కొందరికి లేని భయాలు పుట్టుకొస్తుంటాయి. ఇప్పుడు నటి కాజల్ అగర్వాల్‌కు చిన్ననాటి నుండి ఉన్న భయం పోయిందట. అదేమిటంటే, ఈ బ్యూటీకి చిన్నప్పటి నుంచీ పక్షులంటే భయమట. అసలు వాటి దరిదాపులోకి కూడా వెళ్లదట. అందులోనూ పావురాలంటే చచ్చేంత భయమట. 
 
అలాంటి కాజల్‌కి ఇప్పుడు ధనుష్ హీరోగా రూపొందుతున్న తమిళ సినిమా 'మారీ'తో ఆ భయం పోయిందట. ఈ విషయం గురించి కాజల్ మాట్లాడుతూ...  ఈ చిత్రంలో పక్షులతో కలసి నటించాల్సి వచ్చిందని తెలిపింది. దీంతో ఆ సినిమానే రద్దు చేసుకోవాలని తలచినట్టు తెలిపింది. అయితే చిత్ర యూనిట్ సభ్యులు తనకు నచ్చజెప్పి మెల్లగా అలవాటు చేయడంతో పక్షులతో చనువు ఏర్పడి భయం పూర్తగా పోయిందని కాజల్ ధీమా వ్యక్తం చేస్తోంది.