1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 27 మే 2015 (16:10 IST)

శంకర్ దర్శకత్వంలో కమల్ భారతీయుడు పార్ట్-2

ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన భారతీయుడు పార్ట్-2 రూపుదిద్దుకుంటోందని జోరుగా ప్రచారం సాగుతోంది. కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్‌లో 1996లో రిలీజై హిట్ అయిన భారతీయుడు సినిమా అందరికీ గుర్తిండే వుంటుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చారు. మనీషా కొయిరాలా ఈ మూవీలో హీరోయిన్‌గా నటించింది. 
 
తాజాగా ఈ సినిమా సీక్వెల్‌కు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎ.ఎం. రత్నంతో శంకర్ చర్చలు జరిపారని, శంకర్ అసిస్టెంట్స్ భారతీయుడు పార్ట్ 2 పనుల్లో బిజీ బిజీగా ఉన్నట్లు తెలిసింది. దీనిపై ఎ.ఎం. రత్నం మాట్లాడుతూ.. ప్రస్తుతానికి అజిత్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నానని.. ఇప్పటికైతే భారతీయుడు 2 గురించి ఎలాంటి చర్చలు జరగలేదన్నారు.