శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 4 మార్చి 2015 (13:59 IST)

రాజకీయాలపై కమల్ కన్ను.. కొత్త చిత్రానికి రెడీ..!

లోకనాయకుడు కమలహాసన్ నటించే ప్రతి సినిమా వైవిధ్యభరితంగా ఉంటుంది. అందువలేనే ఆయన సినిమాల కోసం అభిమానులు ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం కమల్ హాసన్ 'విశ్వరూపం 2', 'ఉత్తమవిలన్', 'పాపనాశం' చిత్రాలను పూర్తి చేశారు. 
 
ఈయన ప్రస్తుతం మరో రెండు సినిమాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. కాగా వీటిలో ఒకటి థ్రిల్లర్ కథాంశంతో, తమిళంలో రూపొందిస్తున్నారు. మరొకటి పూర్తి స్థాయి హిందీ చిత్రం అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించాలని కమల్ అనుకుంటున్నట్టు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. 
 
సమకాలీన రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలతో ఇది సాగుతుందని అంటున్నారు. రాజకీయల్లోకి రానంటున్న కమల్, రాజకీయ నేపథ్యంలో చిత్రాన్ని తెరక్కెంచేందుకు యత్నిస్తుండడంతో ఆయన మనసు రాజకీయాలవైపు మొగ్గు చూపుతుందా అనే సందేహం అభిమానుల్లో కలుగుతోంది. మరి ఈ చిత్రం ఎటువంటి వివాదాలను రేపుతుందో వేచి చూడాల్సిందే.