శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 14 సెప్టెంబరు 2014 (15:11 IST)

ఎట్టకేలకు కార్తీకేయుడు సెన్సార్‌ అయ్యాడు!

కార్తీకేయుడు అంటే ఈశ్వరుడు. అలాంటి పేరు పెట్టిన సినిమాకు సెన్సార్‌ నుంచి తిప్పలు తప్పలేదు. ఈ చిత్రంలో నిఖిల్‌ హీరోగా చేస్తున్నాడు. ఇందులో ఓ సన్నివేశంలో పాము కన్పిస్తుంది. 
 
మరి ఆ సీన్‌లో ఏముందోకానీ... జంతువులను ఇబ్బందిపెట్టే విధంగా సీన్స్‌ తీయరాదని సెన్సార్‌వారు అభ్యంతరాలు పెట్టారు. దాంతో ఎప్పటినుంచో సెన్సార్‌ కావాల్సింది... వాయిదా పడుతూవచ్చింది. దీంతో సినిమా కూడా ఆలస్యమైంది. 
 
ఎట్టకేలకు శుక్రవారంనే సెన్సార్‌ పూర్తయింది. యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఈ చిత్రం తమిళంలోకూడా విడుదలకాబోతుంది. సో.. ఈ సినిమా చాలా బాగావచ్చిందనీ, సక్సెస్‌ఫై నమ్మకంతో వున్నానని నిఖిల్‌ తెలియజేస్తున్నాడు.