1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 26 జనవరి 2015 (15:38 IST)

''కత్తి'' విజయ్‌కి బాలీవుడ్ భామ కావాలట!

కత్తి హీరో, తమిళ స్టార్ హీరో విజయ్ కూడా ఇప్పుడు బాలీవుడ్ భామలపై మనసు పారేసుకున్నాడు. తన తదుపరి చిత్రానికి బాలీవుడ్ కథానాయికను బుక్ చేయమని నిర్మాతలకు చెప్పాడట. ప్రస్తుతం 'పులి' సినిమాలో నటిస్తున్న ఈ హీరో దీని తర్వాత అట్లీకుమార్ దర్శకత్వంలో తన 59వ చిత్రాన్ని చేయాల్సివుంది. ఇందులో మొదట్లో నయనతార కోసం ట్రై చేశారు. 
 
అయితే, అమ్మడు వీరడిగిన డేట్స్ ఖాళీ లేవని చెప్పడంతో, కాస్త ఎక్కువ ఖర్చయినా ఇక బాలీవుడ్ ముద్దుగుమ్మనే తీసుకోమని విజయ్ సలహా ఇచ్చాడట. దాంతో దీపిక పదుకొనె లేదా సోనాక్షి సిన్హా కోసం ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నారట. సో, నయన్ ఒప్పుకోకపోవడం వల్ల నిర్మాతకు ఇలా కోట్లు వదులుతున్నాయి!