శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 18 ఆగస్టు 2014 (18:31 IST)

కళ్యాణ్ రామ్'కిక్ 2' రెడీ... రవితేజ హీరో...

“రేసు గుర్రం”సినిమా సూపర్ హిట్ తో ఫుల్ జోష్ తో వున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి 'కిక్2' ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ నెల 20న 'కిక్ 2' ముహూర్తం పెట్టేసినట్లు టాలీవుడ్ సినీజనం చెపుతున్న న్యూస్. ఫస్ట్ 'కిక్'ను సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఆర్ఆర్ మూవీస్ నిర్మిస్తే కిక్ 2 ను ఎన్ టి ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి వారసుడు, హీరో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. 
 
ఈ “కిక్” చిత్రానికి నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మాతగా, రవితేజ కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంపై అప్పుడే భారీ అంచనాలు ప్రారంభమయ్యాయి. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని సంస్థకు ప్రతిష్టాత్మకంగా పేరు రావడానికి భారీ స్థాయిలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ చిత్రం ద్వారా రవితేజ మరోసారి మాస్ హీరోగా నిరూపించుకోవడానికి ‘కిక్’ తర్వాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. కిక్ 2గా రాబోతున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి మనోజ్ పరమహంస కెమెరా మాన్‌గా, తమన్ సంగీత దర్శకుడిగా పనిచేయనున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్‌రెడ్డి.