శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 జనవరి 2015 (17:33 IST)

లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మేన్‌ బి కేర్‌ఫుల్‌!: రివ్యూ రిపోర్ట్

నటీనటులు: చైతన్యకృష్ణ, స్వాతిదీక్షిత్‌, అడవిశేష్‌, నిఖితా నారాయణ్‌, కమల్‌కామరాజు, మహత్‌ రాఘవేంద్ర, జాస్మిన్‌ ఖాసిన్‌ తదితరులు 
కెమెరా: జగన్‌ చావలి,
కథ: సంజీవ్‌రెడ్డి,
సాహిత్యం: సిరాశ్రీ, 
మాటలు: నివాస్‌,
సంగీతం: రఘుకుంచె,
నిర్మాతలు: మధుర శ్రీధర్‌రెడ్డి, డా. ఎం.వి.కె.రెడ్డి, 
దర్శకత్వం: పి.బి. మంజునాథ్‌. 
 
మధుర ఆడియో పెట్టి తర్వాత దర్శకుడిగా మారి స్నేహగీతం, ఇట్స్‌మైలవ్‌స్టోరీ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్రీధర్‌ బేసిక్‌గా ఎన్‌ఆర్‌ఐ. అక్కడ పద్ధతులు అన్నీ తెలుసు గనుక ఆ తరహా కథలు తీస్తూ యూత్‌ఫుల్‌ను ఆలోచించేలా చేసేవాడు. కానీ దర్శకుడిగా ప్రేక్షకులు సరైన తీర్పు ఇవ్వకపోవడంతో నిర్మాతగామారి తొలిసారిగా తీసిన చిత్రం ' లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మేన్‌'. ఈ చిత్రం హిందీలో 'లాగిన్‌' చిత్రానికి రీమేక్‌గా చేశారు. మరి ఎలా వుందో చూద్దాం. 
 
కథ: 
ముగ్గురు భిన్నమైన జంటల కథ. కృష్ణమూర్తి (చైతన్యకృష్ణ) కాలేజీలో చదివుతూ వుంటాడు. ఫేస్‌బుక్‌ టెక్నాలజీలో తను ఓ గాళ్‌ఫ్రెండ్‌ను సంపాదించుకుంటాడు. ఇంకోవైపు ఆనంద్‌ (కమల్‌కామరాజు) బిజినెస్‌మేన్‌. భార్య ప్రియ (నిఖితానారాయణ్‌)తో గడిపే క్షణాలే తక్కువ. మరోవైపు విజయ్‌ (మహత్‌రాఘవేంద్ర) ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో చిన్న వుద్యోగి. కష్టపడకుండా మోసంచేసి బతకడమంటే చాలా ఇష్టం.

మోడల్‌ అంజలి (జాస్మిన్‌ఖాసిన్‌)ను ప్రేమించడానికి అప్పులుపాలయినా ఖర్చుచేస్తూనే వుంటాడు. రాహుల్‌ (అడవిశేషు) ప్రియ ఒకప్పటి క్లాస్‌మేట్‌. ఫేస్‌బుక్‌ద్వారా ఇద్దరూ మళ్లీ కలుస్తున్నారు. వీరందరిదీ ఒక్కో కథ. వారి కథలు చివరికి ఎటువంటి ముగింపు ఇచ్చాయి అనేది సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌ 
నటీనటులపరంగా అందరూ బాగానే చేసేవారు. బిజెనెస్‌మేన్‌ కమల్‌కామరాజు తన శైలిలో చేసేవాడు. అలాగే మిగిలినవారూ కూడా. కథాప్రకారంగా సాగిపోయే పాత్రలు. 
 
టెక్నికల్‌గా రఘుకుంచె చేసిన టైటిల్‌ సాంగ్‌.. ఫేస్‌బుక్‌ గురించి. కథంతా అందులోనే వుంది. వినడానికి చాలా బాగుంది. కేవలం అది ప్రమోషన్‌ సాంగ్‌ గానే మిగిలిపోయింది. బ్యాక్‌గ్రౌండ్‌ సంగీతం పర్వాలేదు. ముఖ్యంగా మాటలపరంగా నివాస్‌ బాగా పొందుపర్చాడు. పంచ్‌ డైలాగ్‌ పేరుతో పేలకుండా సన్నివేశపరంగా పేలాడు. దర్శకుడు మంజునాథ్‌ కొత్తవాడయినా చెప్పాలనుకున్న పాయింట్‌ స్ట్రెయిట్‌గానే చెప్పేశాడు. 
 
విశ్లేషణ. 
కంటెంట్‌ సినిమాకు పాటలు ఏమాత్రం వుపయోగపడవు. పబ్‌సాంగ్‌లోనే మరోసారి క్యారెక్టర్ల గురించి చెప్పేస్తాడు. ఫేస్‌బుక్‌ టెక్నాలజీతో ఫేక్‌పేర్లతో ఒకరినొకరు ఎలా మోసం చేస్తున్నారో చక్కగా వెల్లడించాడు. అదే ఫేస్‌బుక్‌తో బయటకురాని సైబర్‌ క్రైమ్‌లు ఎలా జరుగుతున్నాయో వివరించాడు దర్శకుడు. డబ్బుకోసం డాంబికాలు పోయి వ్యక్తుల గురించి. అబ్బాయిల్ని అందంతో వలలోవేసి అతన్ని ఎలా నాశనం చేస్తారనే కళ్ళకు కట్టినట్లు చూపించాడు. 
 
మొదటిభాగంలో ఎక్కడా సినిమా ఎటువైపు వెళుతుందో అర్థంకాదు. సెకండాఫ్‌లోనే కథలో కూడా ఆఖరి 20నిముషాలు ట్విస్ట్‌ ఒక్కసారిగా ప్రేక్షకుడిని ఎలర్ట్‌ చేస్తుంది. చిత్రంలో మూలం అదే. అదే లేకపోతే మిగతాదంతా ఫేక్‌ స్టోరీనే అనిపిస్తుంది.
 
ఫేస్‌బుక్‌ను కోట్లమంది వుపయోగిస్తుంటారు. అందులో చాలామంది మోసపోతున్నావారున్నారు. వారంతా బయటకు చెప్పుకోక ఎంతోమంది మరణించిన సందర్భాలున్నాయి. కృష్ణమూర్తి పాత్రతో యువతకు కళ్లుబైర్లుకమ్మే నిజాన్ని చెప్పి లేడీస్‌ ఎంతటి మోసకార్లనేది వెల్లడించారు. ఇవి నిజంగానే జరిగాయనీ, రియల్‌స్టోరీతో కథ తీశామని దర్శకుడు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. 
 
ప్రేమపేరుతో దగ్గరకు చేసి ఆ తర్వాత అతన్ని మత్తులోకిదించి కిడ్నీలు, గుండె, కళ్ళు దోచుకునే వైట్‌కాలర్‌ నేరం సైబర్‌ నేరం. ఇలాంటి అసలు బయట జరుగుతున్నట్లుగాకూడా తెలీదు. ఒకప్పుడు ఇలాంటివి పేదలను మాయచేసి మత్తుమందు ఇచ్చి ఎత్తుకెళ్ళి చేసేవారు. 
 
టెక్నాలజీ పెరిగాక ఇలా చేస్తున్నారు అంటూ చెప్పిన విధానం బాగుంది. ఇలా ప్రతిపాత్రల్లో ఓ నీతిని చెప్పి. ప్రేమలు అనేవి మనస్సుతో చూడాలి. ఏదో ఆర్భాటం, ఆవేశంతో గబగబా ఒకరికొరు దగ్గరయితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది యూత్‌కు చెప్పదలిచాడు. 
 
అయితే మహత్‌ పాత్రలో క్రికెడిట్‌కార్డులను మోసం చేసే విధానం అనేది కొత్తకాన్సెప్ట్‌గా అనిపిస్తుంది. స్క్రిమ్మింగ్‌ మిషన్‌ అనేదానితో సొసైటీలో డబ్బున్నవారిని తెలీయకుండా లక్షలకులక్షలు గీగేయడం అనేది ఇంట్రెస్ట్‌గా వున్నా... ఇలాంటి జరుగుతున్నాయనే వారు భయపడేట్లుగా వుంది. సో.. చిన్నచిన్న లాజిక్కులు మిస్సయిన ఈ చిత్రం ఇప్పటి మాస్‌ ప్రేక్షకులకు నచ్చకపోవచ్చుకానీ.. మల్టీప్లెక్స్‌ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్‌ అవుతుంది. 
 
రేటింగ్‌: 3/5