శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (18:54 IST)

ముందుకొస్తున్న 'లయన్'.. విడుదల తేదీ మార్పు!

నందమూరి హీరో బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'లయన్'. నూతన దర్శకుడు సత్యదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ 'లయన్' చిత్రంలో త్రిష, రాధికా ఆప్టే కథానాయికలుగా నటిస్తున్నారు. తొలుత ఈ చిత్రాన్ని మే డే రోజైన మే నెల ఒకటో తేదిన విడుదల చేయాలని నిర్ణయించారు. అందుకోసం నిర్మాతల సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలొచ్చాయి.

తాజాగా ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల చేయడానికి నిర్ణయించినట్టు సమాచారం. వివిధ సినిమాల విడుదల తేదీలను దృష్టిలో పెట్టుకుని ఈ స్వల్ప మార్పు చేసినట్టు చెబుతున్నారు.  బాలకృష్ణ నటించిన 'లెజండ్' వంటి సూపర్ హిట్టు తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాకి చాలా క్రేజ్ వచ్చింది.