శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: బుధవారం, 25 మార్చి 2015 (19:11 IST)

'మా' ఎన్నికల్లో రాజకీయ నాయకుడు జోక్యమా... ఎవరు?!! ''మా'' రచ్చ

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో అధ్యక్ష పదవి పోటీ హాట్‌హాట్‌గా మారింది. ఈ పోటీలో జయసుధ నిలబడింది. అంతకుముందు నుంచే రాజేంద్రప్రసాద్‌ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే జయసుధ పోటీ చేయకూడదని.. ఆమె మహిళ అని ఇక్కడ మగవారే చూసుకుంటారని రాజేంద్రప్రసాద్‌ పలువురు రాజకీయ నాయకులచేత జయసుధకు చెప్పించారంటూ జయసుధ ఆరోపిస్తున్నారు.

 
ఇంకా తనకు ఓ రాజకీయ నాయకుడి చేత ఫోన్లు చేయించారంటూ పేర్లు వద్దని ఆమె వ్యాఖ్యానించారు. ఐతే ఆ రాజకీయనాయకులు ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయా సమాచారం మేరకు ఆమెకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టాప్ లీడర్ చేత ఫోన్‌ చేయించారనే ప్రచారం జరుగుతోంది. ఆయనతోనే కాకుండా తెలంగాణ నుంచి తెరాస మంత్రితో కూడా చేయించారని చెప్పుకుంటున్నారు. ఐతే ఇవన్నీ ట్రాష్ అంటూ రాజేంద్రప్రసాద్ కొట్టిపారేశారు.
 
జయసుధ పేరు ఎలా వచ్చింది! 
మొదట ఈ పోటీనుంచి ఈనెల 21తో కాలపరిమితి అయిపోతున్న మురళీమోహన్‌ తాను ఎం.పిగా, రాజమండ్రి పుష్కరాల భాధ్యతలు నిర్వహించాల్సి వున్నందున నిలబడని మా కార్యవర్గ సభ్యుల సమావేశంలో వెల్లడించారు. ఆ వెంటనే రాజేంద్రప్రసాద్‌ పేరు ఆయన మద్దతుదారులు ప్రకటించడం. జరిగింది. దీనికి ఆయన దాసరి, చిరంజీవి కుటుంబ సభ్యుల మద్దతుకూడా కూడగట్టారు. అయితే అనుకోని మలుపుతో మళ్ళీ మురళీమోహన్‌ నామినేషన్‌ వేస్తున్నట్లు ఆ మరునాడు మా మీటింగ్‌లో ప్రకటించారు. 
 
కానీ.. ముందు పాల్గొననీ, తర్వాత మరలా పాల్గొంటానని అనడంతో కార్యవర్గసభ్యులు చర్చ అనంతరం.. జగపతిబాబు పేరు ప్రస్తావనకు వచ్చింది. ఇందుకు అగ్రహీరోల మద్దతుకూడా ప్రకటించారు. కానీ ఇక్కడి రాజకీయాల కారణంగా ఆయన తాను విరమించుకుంటున్నట్లు సమావేశంలో వెల్లడించారు. ఆ సమయంలో మహిళకు అవకాశం ఇద్దామని సభ్యుల నుంచి ప్రతిపాదన వచ్చింది. ఆ పేర్లలో జయసుధ పేరు ముందువరుసలో వుంది. కానీ.. ఆమె చేయలగదో లేదోనని మురళీమోహన్‌ అని.. వెంటనే ఆమెను ఫోన్‌లో సంప్రదించడంతో.. గతంలో తాను పనిచేసిన అనుభవాన్ని వివరిస్తూ.... మాట్లాడారు.
 
జయసుధ గతంలో కార్యవర్గసభ్యురాలిగా, ట్రెజరర్‌గా పనిచేసిన అనుభవముంది. అందుకే వైస్‌ప్రెసిడెంట్‌గా పోటీచేయమని మురళీమోహన్‌ సలహా ఇచ్చారు. కానీ అవన్నీ ఇంతకుముందు చేశాననీ, ఎం.ఎల్‌.ఎ.గా వుండి.. మరలా తక్కువ పోస్టుతో వుండటం బాగోదని అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని తెలిపడంతో మురళీమోహన్‌ ప్యానల్‌ ఆమెకు మద్దతు తెలిపారు. ఆ తర్వాత వైస్‌ప్రెసిడెంట్‌గా మంచు లక్ష్మీని ఏకగ్రీవం చేశారు.
 
వెనక్కి తగ్గం: నాగబాబు 
జయసుధ చేసిన కామెంట్‌లతో.. యుద్ధ ప్రాతిపదికన బుధవారంనాడు రాజేంద్రప్రసాద్‌ ప్యానల్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. అందులో నాగబాబు మాట్లాడుతూ... రాజేంద్రప్రసాద్‌ సీనియర్‌ నటుడు, మంచి మనిషి అని నమ్మి మేం సపోర్ట్‌ చేశాం. ఇప్పుడు వెనక్కు తగ్గేదిలేదు. అసోసియేషన్‌ను ప్రశ్నిస్తే బెదిరింపులుగా ప్రచారం చేస్తున్నారని.. ఇవి తనను బాధ కల్గించాయని నాగబాబు పేర్కొన్నారు. ముందుగా ఏకగ్రీవంగా రాజేంద్రప్రసాద్‌ ఎన్నిక అనుకున్నామనీ, కానీ జయసుధను ముందుకు తెచ్చి తమను అవమానించారని పేర్కొన్నారు.