శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 నవంబరు 2014 (14:54 IST)

బాలీవుడ్ మగధీర రీమేక్ కన్ఫమ్: హీరోగా షాహిద్ కపూర్!

బాలీవుడ్‌లో మగధీర రీమేక్ కానుంది. తెలుగులో రాజమౌళి రూపొందించిన మగధీర బంపర్ హిట్టయిన తరుణంలో 'మగధీర' బాలీవుడ్‌లో రీమేక్ అవడానికి సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శక, నిర్మాత సాజిద్ నడియడ్ వాలా ఈ చిత్రాన్ని హిందీలో రూపొందించబోతున్నారు. 
 
రామ్ చరణ్ పాత్రను హీరో షాహిద్ కపూర్ చేయనున్నాడు. కొంతకాలంగా ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నట్లు వస్తున్న వార్తలను దర్శక నిర్మాత ధ్రువీకరించాడు. 
 
"అవును, మగధీర రీమేక్ రైట్స్ నేను తీసుకున్నాను. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ మొదలుపెడతాం. ఆ ఏడాది చివరిలో చిత్రీకరణ మొదలయ్యే అవకాశం ఉంది. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తాడు" అని సాజిద్ తెలిపాడు.