శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 8 ఆగస్టు 2014 (11:54 IST)

మహేష్ బాబు, కృష్ణ క్లాప్ : నరేష్ తనయుడిగా కొత్త చిత్రం!

సీనియర్ నరేష్ తనయుడిగా కొత్త చిత్రం ప్రారంభమైంది. నవీన్‌ విజయకృష్ణని కథానాయకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా రూపొందుతోంది. ఫ్రెండ్లీ మూవీస్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. రామ్‌ప్రసాద్‌ రఘు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 
 
అడ్డాల చంటి, పార్థసారథి గవర నిర్మాతలు. ఈ సినిమా ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి రామానాయుడు, రాఘవేంద్రరావు కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. కృష్ణ, మహేశ్‌బాబు క్లాప్‌నిచ్చారు. విజయనిర్మల గౌరవ దర్శకత్వం వహించారు.
 
అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కృష్ణ మాట్లాడుతూ నవీన్‌లో మంచి ఈజ్‌ ఉందని, చక్కటి నటుడవుతాడని తెలిపారు. తమ కుటుంబం నుంచి ఇప్పటికి హీరోగా పరిచయమవుతున్న ఆఖరివాడు నవీన్‌ అని విజయనిర్మల తెలిపారు. 
 
నరేష్‌ మాట్లాడుతూ ‘‘నా ఏడో ఏట ‘పండంటి కాపురం’లో నటించాను. 17వ ఏట ‘నాలుగు స్తంభాలాట’లో హీరోగా చేశాను. నా సెకండ్‌ ఇన్నింగ్స్‌ ‘అల్లరి రాముడు’ సినిమాతో మొదలైంది. ఇప్పుడు అదే సంస్థ మా అబ్బాయి నవీన్‌ను హీరోగా పరిచయం చేయడం ఆనందంగా ఉందన్నారు.
 
కాగా పోసాని కృష్ణమురళి, రవిబాబు, ధనరాజ్‌, సప్తగిరి, గబ్బర్‌సింగ్‌ టీమ్‌, ప్రగతి, వేణు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహతి సాగర్‌, ఎడిటర్‌: త్యాగరాజన్‌.