శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 13 మే 2015 (16:35 IST)

మహేష్ 'శ్రీమంతుడు' మారుతాడా..? 'మగాడు'గా వస్తాడా..?

టాలీవుడ్ హీరో మహేష్ బాబు నటిస్తున్న తాజాగా చిత్రం 'శ్రీమంతుడు'. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర టైటి‌ను మార్చాలని చిత్ర మేకర్స్ చాలా రోజులుగా అనుకుంటున్నారు. అయితే వారు అనుకునే విధంగా టైటిల్ కుదరడం లేదు. 'శ్రీమంతుడు' టైటిల్‌ను ఆ మధ్య 'జమీందారు'గా మార్చాలనుకున్నారు. అయితే అది కుదరలేదు.
 
ఇక ఈ సినిమా ని డిస్ట్రిబ్యుటర్స్ కి ఇచ్చిన తరువాత అందరూ కలిసి ఒక మాస్ టైటిల్ ని ఫిక్స్ చెయ్యాలని ప్లాన్ చేశారు. దీంతో తాజాగా 'శ్రీమంతుడు' టైటిల్‌కు 'మగాడు' అనే పేరు పెట్టాలని అనుకుంటున్నారు. అయితే ఇది కూడా ఖరారు లేదు. ఇక మే 31న ఈ సినిమా టీజర్‌ని, టైటిల్‌ని, ఫస్ట్ లుక్‌ని విడుదల చెయ్యనున్నారు. 
 
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మే 31 సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు అట. ఈ సందర్భంగా ఆ రోజు టీజర్‌ని, టైటిల్‌ని, ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ టైటిల్‌ను, ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసిన తరువాత సినిమాని జూలై 17న విడుదల చెయ్యడానికి చిత్ర దర్శక నిర్మాతులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సో, చిత్రం టైటిల్ పేరు మారుతుందో లేదో అప్పుడే తెలుస్తుంది.