శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 7 జులై 2014 (15:15 IST)

లక్ష్మీ మంచు కుమార్తె పేరు.. "విద్యా నిర్వాణ మంచు ఆనంద్"

వామ్మో ఇంత పెద్ద పేరా అనుకోవద్దు. లక్ష్మీ మంచు కుమార్తెకు "విద్యా నిర్వాణ మంచు ఆనంద్" అనే నామకరణం చేశారు. తన గారాలపట్టికి తమ కుటుంబంలో అందరి పేర్లు కలిసి వచ్చేలా పేరు పెట్టాలనుకుంటున్నట్లు ఆమె చెప్పింది.

ఆమె చెప్పినట్లు కుమార్తెకు ఈ పేరు పెట్టారు. ఇంకా లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ.. చిన్నారికి 21 రోజులు నిండిన సందర్భంగా తన కుమార్తె ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేసినట్లు తెలిపారు. పాప ఫోటోలు ఫ్రెండ్స్ కోసం షేర్ చేశామన్నారు. 
 
పూర్తి సరొగసీ పద్ధతిలో తల్లి అయ్యానని.. ఈ ప్రక్రియ కొంతవరకు హైదరాబాద్‌లో జరిగాక, సరొగేట్ మామ్ గర్భంలో పెట్టడం కోసం గుజరాత్‌కు వెళ్లామని, మొదట ఇదంతా హైదరాబాద్‌లోనే చేయించుకోవాలనుకున్నా.. మీడియాకు తెలిసిపోతుందన్న భయంతో వద్దనుకున్నట్లు చెప్పారు. పక్కా లీగల్ ప్రకారమే సరోగసి ద్వారా తల్లి అయినట్లు వెల్లడించారు.