శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 3 మార్చి 2015 (12:12 IST)

'పందెం కోడి' సీక్వెల్ రెడీ.. మే 1 నుంచి షూటింగ్ ప్రారంభం..!

ఇతర భాషల నుంచి తెలుగులోకి ఎక్కువగా రీమేక్‌ లేక డబ్బింగ్‌ అవుతున్న చిత్రాల్లో తమిళ సినిమాలే ఎక్కువ. అందులోనూ హీరో విశాల్ చిత్రాలు అధిక సంఖ్యలో తెలుగులో వస్తుంటాయి. గతంలో విశాల్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తమిళంలో 'సండ కోళి'గాను, తెలుగులో  'పందెం కోడి'గా విడుదలైన చిత్రం కోలీవుడ్, టాలీవుడ్‌లలో ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. 
 
టాలీవ్‌లో కూడా విశాల్ మార్కెట్‌ని పందెం కోడి బాగా పెంచింది. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ చేసే పనిలో లింగుస్వామి బిజీగాఉన్నాడట. ఇప్పటికే లింగుస్వామి ఈ సీక్వెల్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడని, మే ఒకటో తేది నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనున్నదని కోలీవుడ్ టాక్. ఈ సినిమాని మాస్ ఎంటర్టైనర్ గా రూపొందించనున్నారు. మరి ఈ సీక్వెల్ సినిమా మొదటి భాగం లా సూపర్ హిట్ అవుతుందో ? లేక అంచనాలని అందుకోలేకపోతుందో ? వేచి చూడాలి.