శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 29 ఏప్రియల్ 2015 (11:49 IST)

మీనాక్షి రీఎంట్రీ... సన్నీ డియోల్ కోరిక తీర్చడానికే..!

ఒకప్పుడు క్రేజీ బ్యూటీలుగా వెలిగిన అందాల భామలు పెళ్లి, పిల్లలు అంటూ గ్యాప్ ఇచ్చి మళ్లీ రీఎంటీ అవుతున్నారు. ఆ కోవలో తాజాగా మీనాక్షి శేషాద్రి కూడా చేరుతోంది. ఈ సుందరి గతంలో 'ఆపద్బాంధవుడు' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది. ఆ తర్వాత అమ్మడు పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగుపెట్టింది. ఈ బాలీవుడ్ భామ పదిహేనేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఓ హిందీ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. 
 
తన చిరకాల మిత్రుడు సన్నీ డియోల్ తాను హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న 'ఘాయల్' సీక్వెల్ 'ఘాయల్ వన్స్ ఎగైన్' చిత్రంలో తాను నటించాలని కోరాడని తెలిపింది. ఆయన కోరికను తీర్చడానికే తాను మళ్లీ నటించేందుకు అంగీకరించానంటోంది. ఒకసారి మళ్లీ వస్తోంది కాబట్టి, ఆఫర్లు వస్తే కంటిన్యూ చేస్తుందేమో!