శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 21 మే 2015 (17:25 IST)

మనోజ్ దంపతులకు మోడీ శుభాకాంక్షలు... మోహన్ బాబుకు లేఖ... ట్వీట్..

బిజీ షెడ్యూల్ కారణంగా మనోజ్ వివాహానికి మోడీ హాజరు కాలేదని, అయితే నవ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ మోడీ తనకు లేఖ రాశారని మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇంకా మోహన్ బాబు ట్వీట్ చేస్తూ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నుంచి ఉత్తరం అందుకోవడం చాలా గౌరవంగా భావిస్తున్నా. కొత్తగా పెళ్లయిన వధూవరులకు ఆశీర్వాదం తెలుపుతూ అందమైన లేఖ రాశారు. అంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన గుర్తుంచుకున్నారు అని చెప్పారు. 
 
అంతేకాకుండా మోడీజీ నుంచి యువకులు, ఔత్సాహిక రాజకీయ నాయకులు చాలా నేర్చుకోవాలని, ప్రధానంగా నాయకునిగా ఎలా ఉండాలి, స్నేహితుడు, సోదరుడిగా ఎలా ఉంటూ వస్తున్నారు? అన్న విషయాలు నేర్చుకోవాలి అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు.