శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 23 ఆగస్టు 2014 (18:32 IST)

నేను విష్ణుని ఎలా చూడాలనుకొన్నానో.. వర్మ అలా చూపించాడు... కె.కింగ్

'నా పెద్ద కొడుకు (మంచు విష్ణు)ని సిన్సియర్‌ అండ్‌ స్ట్రిక్ట్‌ పోలీస్‌ ఆఫీసర్‌ (ఐ.పి.ఎస్‌)ని చేయాలనుకొన్నాను. కానీ వాడు తన అభీష్టం మేరకు హీరో అయ్యాడు. అయితే.. నేను విష్ణుని ఎలా చూడాలనుకొన్నానో, 'అనుక్షణం' చిత్రంలో వర్మ అలా చూపించాడు. అసలు నేను వర్మను 'డార్లింగ్‌' అని ఎందుకు అంటానో 'అనుక్షణం' సినిమా చూసిన తరువాత అందరికీ అర్ధమవుతుంది' అన్నారు కలెక్షన్ కింగ్ డా|| మంచు మోహన్‌ బాబు.
 
ఇటీవల ఆయన 'అనుక్షణం' చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'చిన్నతనంలో నేను ఇంగ్లీష్‌ సినిమాలు ఎక్కువగా చూసేవాడ్ని. అయితే.. భాష రాకపోవడం వల్ల పక్క వాళ్ల ఎక్స్‌ప్రెషన్‌ని బట్టి సదరు చిత్రాన్ని ఆస్వాదించేవాడ్ని. ఆ టైమ్‌లో అనిపించేది.. ఇటువంటి సినిమాలు తెలుగులో వస్తే ఎంత బాగుంటుందో అని. 'అనుక్షణం' అటువంటి చిత్రమే. 
 
సినిమా మొదలైనప్పట్నుంచి.. ఎండింగ్‌ టైటిల్స్‌ పడేంతవరకు టైటిల్‌కు తగ్గట్లుగా 'అనుక్షణం' ఉత్కంఠభరితంగా సాగుతుంది. మనకున్న 'లెజెండ్రీ డైరెక్టర్స్‌'లో వర్మ ఒకరని అందరికీ తెలుసు. వర్మ స్థాయిని వంద రెట్లు పెంచే చిత్రం 'అనుక్షణం'. ఐ.పి.ఎస్‌ ఆఫీసర్‌గా విష్ణు, సైకాలజిస్ట్‌గా రేవతి క్యారెక్టర్లను వర్మ మలిచిన విధానం, వారి నుంచి అద్భుతమైన నటనను రాబట్టిన వైనం నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇవన్నీ నేను నా కొడుకు సినిమాని ప్రమోట్‌ చేయడం కోసమో, లేదా 'అనుక్షణం' చిత్రానికి హైప్‌ తీసుకురావడం కోసమో చెబుతున్న కబుర్లు కావు, కేవలం 'అనుక్షణం' సినిమా చూసిన తరువాత నాకేమనిపించిందో అదే ఇక్కడ అక్షర రూపంలో పొందుపరిచాను' అన్నారు.
 
ఎ.వి.ఆర్ట్స్‌ పతాకంపై 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సమర్పణలో పార్ధసారధి-గజేంద్ర నాయుడు- విజయ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తేజశ్వి, మధుశాలిని, బ్రహ్మనందం, నవదీప్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సెప్టెంబర్‌ 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది!