శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : శనివారం, 24 జనవరి 2015 (14:45 IST)

నవ్వుల రేడు ఎంఎస్ నారాయణ అంత్యక్రియలు పూర్తి!

హైదరాబాద్, ఎర్రగడ్డ శ్మశానవాటికలో ఎంఎస్ నారాయణ అంత్యక్రియలు శనివారం పూర్తి చేశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఆయన మృతి చెందిన విషయం తెల్సిందే. 
 
శనివారం ఉదయం హైదరాబాదు, వెంకటగిరిలోని స్వగృహం నుంచి మొదలైన ఎంఎస్ నారాయణ అంత్యక్రియలు ఎర్రగడ్డ శ్మశాన వాటికలో పూర్తి చేశారు. ఈ అంత్యక్రియల్లో సినీ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఎర్రగడ్డ శ్మశాన వాటికలో ఎంఎస్ నారాయణ చితికి ఆయన కుమారుడు నిప్పు పెట్టారు. 
 
అంతకుముందు నవ్వుల రేడు ఎంఎస్ నారాయణ అంతిమయాత్ర హైదరాబాదులోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రలో పలువురు సినీ నటులు, అభిమానులు పాల్గొన్నారు. ఇక ఆయన చివరి చూపుకోసం సన్నిహితులు, ఇతరులు భారీగా తరలివచ్చి పాల్గొన్నారు. 
 
యాత్ర ముగిసిన వెంటనే ఎర్రగడ్డ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగనున్నాయి. అంతకుముందు నటుడు మహేష్ బాబు ఎంఎస్‌కు చివరిసారిగా నివాళులర్పించారు. తీవ్ర అనారోగ్యం కారణంగా ఎంఎస్ కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే.