శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : గురువారం, 7 ఆగస్టు 2014 (18:23 IST)

కైపెక్కించే సాంగ్‌లో మత్తెక్కిస్తున్న ముమైత్ ఖాన్!

ఎప్పుడో ఆ మధ్య పూరీ జగన్నాథ్ సినిమాలో 'నాకింకా పదహారే..' అంటూ యూత్‌ను హుషారెత్తించిన హాట్ గర్ల్ ముమైత్‌ ఖాన్‌. ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాల్లో కనిపించి చాలా కాలమైంది. విదేశాల్లో డాన్స్‌ ప్రోగ్రామ్‌లు ఇస్తూ సినిమాలకంటే ఎక్కువ రాబడి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే చాలా కాలంగా తర్వాత బాలీవుడ్‌లో 'ఎడిక్షన్‌ (ట్రిప్‌) అనే వీడియో సాంగ్‌లో దర్శనమిచ్చింది. 
 
పబ్‌లో డాన్స్‌వేస్తూ... కైపెక్కించే మత్తుకళ్ళతో ఆమె డాన్స్‌ చేసిన భంగిమలు యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ఇది ముమైత్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌గా పేర్కొంటూ స్టేట్‌మెంట్‌ కూడా ఇస్తోంది. ప్రస్తుతం అన్ని భాషల్లోనూ హీరోయిన్లే పబ్‌ డాన్స్‌లు వేస్తుంటే.. ఇంకా ఇలాంటి డాన్సర్లకు అవకాశాలు వుంటాయోలేదో కాలమే నిర్ణయించాలి మరి.