శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 29 మే 2015 (12:12 IST)

పెళ్లికి ముందు సెక్స్ తప్పు కాదు... తానిసా ముఖర్జీ

గతంలో సంచలనం రేపిన ఒక హాట్ టాపిక్ మళ్లీ తెరపైకి వచ్చింది. పెళ్లికి ముందు సెక్స్ అనే అంశానికి తాజాగా బాలీవుడ్ బ్యూటీ తానిసా ముఖర్జీ మద్దతు ప్రకటించింది. ప్రముఖ నటి కాజోల్ చెల్లెలు తానిసా పెళ్లికి ముందు సెక్స్ అనుభవం ఉండడంలో తప్పులేదంటోంది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ట్విట్టర్లో జరిగిన చర్చల్లో ఆమె ఈమేరకు స్పందించారు. పెళ్ళికి ముందే శృంగారంలో పాల్గొనటంలో తప్పేమీ లేదనే అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది.
 
ఈ విషయంలో వారి ఇష్టం వచ్చినట్లు వారు నడుసుకోవచ్చు అంటూ ఆమె కామెంట్ చేసింది. తన మాజీ బాయ్ ఫ్రెండ్స్ ఉదయ్ చోప్రా, అర్మాన్ కోహ్లి గురించి అడ్డగ్గా ఇప్పుడు వారితో స్నేహం చేయడం లేదని తెలిపింది. బాలీవుడ్ నటులలో సిద్దార్థ్ మల్హోత్రా చాలా హాండ్సమ్‌గా ఉంటాడని కాంప్లిమెంట్ ఇచ్చింది. 
 
గత 2003లో 'ష్..' అనే బాలీవుడ్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన తానిసా నటిగా సెట్ కాలేదు. పెద్దగా అవకాశాలు, తానూ కోరుకున్న విధంగా పాత్రలు రాకపోవడంతో 2011లోనే సినిమాలకి ఫుల్ సాప్ట్ పెట్టేసింది. 2013లో బిగ్ బాస్7 టీవీ రియాల్టీషోలో పాల్గొనడంతో పాటు, 2014 లో గ్యాంగ్స్ అఫ్ హసీపూర్ అనే టీవీ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించింది. అప్పుడప్పుడు పలు టీవీ ప్రోగ్రామ్‌లలో పాల్గొంటోంది.