శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2015 (11:54 IST)

కుల వ్యవస్థపై సినిమా.. జైలుకెళ్తానేమో: కమల్ హాసన్

విశ్వరూపం సినిమాతో నానా తంటాలు ఎదుర్కొన్న సినీ నటుడు కమల్ హాసన్.. కొత్త సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఉత్తమ విలన్ రిలీజ్‌కు తర్వాత నటించే కొత్త చిత్రం కుల వ్యవస్థపై ఆధారపడి ఉంటుందని కమల్ అన్నారు.

ప్రేక్షకుల మదిలో చిరకాలం నిలిచేలా, సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలు తీసే కమలహాసన్.. సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల వ్యవస్థను ఎండగడుతూ, 1968లో తమిళనాడులోని 'కిళవెన్‌మణి' అనే గ్రామంలో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుందని కమల్ తెలిపారు. 
 
దీనికి 'ఉళ్లేన్ అయ్యా' (ఉన్నానయ్యా) అని పెట్టాలని అనుకుంటున్నారు. ఈ చిత్రం తీస్తే తమిళనాట తనను జైలుపాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని కమల్ అంటున్నారు. 44 మంది దళితుల ఊచకోతను చూసిన విద్యార్థి కోణంలో చెప్పేలా కథను సిద్ధం చేసుకున్నానని వివరించారు. సినిమా చిత్రీకరణ ఎప్పుడు మొదలు కానుందనే విషయంలో కమల్ హాసన్ నోరు విప్పలేదు.