శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : సోమవారం, 18 ఆగస్టు 2014 (12:53 IST)

నాగ చైతన్య "ఒక లైలా కోసం" వచ్చే నెల 5న రిలీజ్! (ట్రైలర్ వీడియో)

యువ హీరో నాగచైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం 'ఒక లైలా కోసం' వచ్చే నెల ఐదో తేదీన విడుదల కానుంది. విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజాహెగ్డే నాయిక కగా, హీరో నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 
 
ఈ చిత్ర ప్రోగ్రెస్‌పై దర్శకుడు మాట్లాడుతూ ‘రొమాంటిక్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. కాలేజీ చదువు పూర్తి చేసి కన్‌ఫ్యూజన్‌లో ఉండే కార్తీక్‌ పాత్రలో నాగచైతన్య కనిపిస్తాడు. స్వేచ్ఛను ప్రేమించే కార్తీక్‌ ఓ సందర్భంలో నందనను కలుస్తాడు. ఆమెని ప్రేమిస్తాడు. కానీ ఆమె అతన్ని ఇష్టపడదు. అయినా అనుకోని పరిస్థితుల్లో కార్తీక్‌ను పెళ్లిచేసుకోవాల్సి వస్తుంది. ఇంతకీ కార్తీక్‌ ఆమె ప్రేమను గెలుచుకున్నాడా.. లేదా? అనేది ఆసక్తికరం. వైవిధ్యమైన ఇతివృత్తంతో సాగే సినిమా ఇది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. చైతూ, పూజా తమ పాత్రలకు న్యాయం చేశారు. వచ్చేనెల 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామన్నారు. 
 
కాగా, ఈ చిత్రంలో అలీ, సాయాజీ షిండే, రోహిణి, సుమన్‌, సుధ, చలపతిరావు, ఎం.ఎస్‌.నారాయణ, అన్నపూర్ణ, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిశోర్‌, శుభలేఖ సుధాకర్‌, భరత్‌రెడ్డి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా: ఐ.ఆండ్రూ, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, విజయ్‌, నిర్మాత: అక్కినేని నాగార్జున, దర్శకత్వం: విజయ్‌కుమార్‌ కొండా.