శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (14:48 IST)

నందమూరి కళ్యాణ్‌రామ్‌ పటాస్‌ 90% పూర్తి

'అతనొక్కడే' నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తూ నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం 'పటాస్‌'. ఈ చిత్రం 90 శాతం షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకుంది. 
 
ఈ సందర్భంగా హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ - ''రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం 90 శాతం షూటింగ్‌ కంప్లీట్‌ అయింది. డైరెక్టర్‌ అనిల్‌ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా చాలా లావిష్‌గా రూపొందిస్తున్నాం. బ్యాలెన్స్‌ షూటింగ్‌ కూడా పూర్తి చేసి డిసెంబర్‌ మొదటివారంలో చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు. 
 
ఈ చిత్రంలో సాయికుమార్‌, బ్రహ్మానందం, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్‌ మురారి, సంగీతం: సాయి కార్తీక్‌, ఎడిటింగ్‌: తమ్మిరాజు, ఆర్ట్‌: ఎం.కిరణ్‌కుమార్‌, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, రచనా సహకారం: ఎస్‌.క్రిష్ణ, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎస్‌.జె.ఫణికుమార్‌, చీఫ్‌-కోడైరెక్టర్‌: సత్యం, కో-డైరెక్టర్స్‌: ఎస్‌.క్రిష్ణ, మహేష్‌ ఆలంశెట్టి, నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్‌, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.