శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 20 మార్చి 2015 (11:42 IST)

మూడు కోట్లు ఇస్తే ఎవరి సరసకైనా... నయన సై..!

దక్షిణాది సినీ పరిశ్రమలో క్రేజీ బ్యూటీగా వెలుగుతున్న అందాల తార నయనతార. ఈ బ్యూటీ పెద్ద  హీరోల నుంచి కొత్త హీరోల వరకు ఎవరితోనైనా నటించేందుకు రెడీ అంటోంది. తమిళంలో ప్రస్తుతం బిజీ బిజీగా సినిమాలు చేసేస్తున్న ఈ బ్యూటీ ఎవరైనా డేట్స్ కోసం వస్తే ముందుగా పారితోషికం గురించే మాట్లాడుతోందట. 
 
ఏకంగా మూడు కోట్లు ఇస్తే ఎవరితో చేయడానికైనా సరే అభ్యంతరం లేదు అంటూ కచ్చితంగా చెప్పేస్తోందని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకే, చిన్న హీరోలతో కూడా అమ్మడు ఎక్కువగా సినిమాలు చేస్తోంది. ఇక తన టైం అయిపోతున్నందుకే అమ్మడిలా డబ్బుకే ప్రాధాన్యత ఇస్తోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.