శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 13 సెప్టెంబరు 2014 (13:13 IST)

బాహుబలి స్టెప్పులు కూడా వేస్తాడట.. వామ్మో,, ప్రభాస్.. తమన్నాలపై షూటింగ్

నిజమండి.. 'బాహుబలి' కత్తి యుద్ధాలే కాదు ... కాలుకదుపుతూ అందంగా డ్యాన్సులు కూడా చేస్తాడు. ప్రస్తుతం హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో అదే పని చేస్తున్నాడు.

రాజమౌళి రూపొందిస్తున్న ఈ 'బాహుబలి' సినిమా కోసం ఫిలిం సిటీలో హీరో ప్రభాస్‌పై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం అక్కడ భారీ సెట్స్ కూడా వేశారు. శంకర్ మాస్టర్ దీనికి డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నాడు. మరో పది రోజుల పాటు ఈ షూటింగ్ కొనసాగుతుంది. లవ్ ఓరియెంటెడ్ సాంగ్‌ అయిన పాటకు ప్రభాస్‌తో తమన్నా స్టెప్పులేస్తుందట. 
 
ఇదిలా ఉంచితే, ఇటీవలే మహాబలేశ్వర్లో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. దీంతో సినిమా షూటింగ్ ప్రధాన భాగం పూర్తయిందని సమాచారం. కాగా ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.