శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2015 (15:16 IST)

ఓకే బంగారం‌కు సూపర్ రెస్పాన్స్: యూత్ అంతా నిరంతరం నిత్య నామస్మరణం!

ఓకే బంగారం సినిమాతో నిత్యా మీనన్‌కు ప్రేమకథల రాణి అనే పేరొచ్చేసింది. ప్రస్తుతం యూత్ అంతా నిరంతరం నిత్య నామస్మరణం చేస్తున్నారు. మణిరత్నం తెరకెక్కించిన ఓకే బంగారం సినిమాకి అనూహ్య స్పందన రావడంతో ఈ ప్రేమ కథా చిత్రంలో నిత్యా మీనన్‌ని చూసి తీరాల్సిందేననే మాట ఇప్పుడు యూత్ నోట బలంగా వినిపిస్తోంది. అంతేగాకుండా ఆమె నటించే సినిమాలు చూసేయాల్సిందేనని వారు ఎగబడుతున్నారు. 
 
తెలుగులో నిత్యమీనన్ నటించిన ప్రేమ కథలు ప్రేక్షకుల హృదయాల్లో దృశ్య కావ్యాలుగా నిలిచిపోయాయి. తెలుగు తెరపై ప్రేమ అనే మాటకి నిత్య ఒక పర్యాయపదంగా మారిపోయింది. అలా మొదలైంది .. ఇష్క్ .. గుండెజారి గల్లతయ్యిందే .. మళ్లీమళ్లీ ఇది రానిరోజు వంటి చిత్రాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తాయి. అందం.. అభినయం.. అదృష్టం.. వీటన్నింటి కలయికే నిత్యమీనన్.. అందుకే ఆమె యూత్ కలల రాణిగా పేరు సంపాదించిందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం.